నెల్లూరు జిల్లాలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామానికి చెందిన రొయ్యల చెరువును కొనుగోలు చేసిన రైతు షేక్ సుకుర్ అహ్మద్, తన భార్య నజీమా పేరుకు విద్యుత్ సర్వీస్ మార్చేందుకు అప్లై చేశాడు. ఈ ప్రక్రియలో లైన్మన్ మల్లె సురేష్ రూ.1.5 లక్షల లంచం డిమాండ్ చేసి, ముందుగా రూ.50 వేలును తీసుకున్నాడు. మిగతా లక్ష ఇవ్వలేదని అప్లికేషన్ రిజెక్ట్ చేయించాడు. తర్వాత మరోసారి డబ్బు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నగదు స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

లంచం తీసుకుంటూ లైన్మన్ అరెస్ట్ – ఏసీబీ దాడి