Tuesday, 18 August 2026
  • Home  
  • రోడ్డు విస్తీర్ణంలో తొలగిస్తున్న చెట్లను మరల ఏర్పాటు చేయాలి
- కడప

రోడ్డు విస్తీర్ణంలో తొలగిస్తున్న చెట్లను మరల ఏర్పాటు చేయాలి

ఆర్డిఓ చిన్నయ్యకు ప్రజల వినతి.. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రింగ్ రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు చెట్ల నరికివేతపై వివాదానికి దారితీస్తున్నాయి. రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 20 సంవత్సరాలుగా పెరిగిన చెట్లను నరికివేయకుండా వాటిని మరో ప్రాంతానికి తరలించి సంరక్షించాలని కోరుతూ పులివెందులకు చెందిన చిన్న నరసింహులు, సుబ్బారెడ్డి, రాము, అమీర్ బాష రెవెన్యూ డివిజన్ అధికారి చెన్నయ్యకు వినతి పత్రం అందజేశారు. రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం చెట్లను నరికివేస్తున్నారని దీనివల్ల పర్యావరణానికి, ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. నేషనల్ హైవే రైట్ ఆఫ్ వే అంటే ఆర్ఓడబ్ల్యూ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కోరారు. చెట్లను పూర్తిగా నరికివేయకుండా వాటిని 5 కిలోమీటర్ల పరిధిలోనే మరో ప్రాంతానికి తరలించి నాటాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేసి ముందుగా చెట్లను తరలించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను కోరారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని ఆదేశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రాజెక్టు ఉందన్న కారణంతో పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం సమంజసం కాదని అవసరమైన కనీస సంఖ్యలో మాత్రమే చెట్లను తొలగించేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొన్న విషయాన్ని ఫిర్యాదుదారు గుర్తుచేశారు. అలాగే రోడ్డు విస్తరణలో కూడా చెట్ల నరికివేతను తగ్గించే విధంగా వన్‌సైడ్ అక్విజిషన్ లేదా ఎక్సెంట్రిక్ వైడెనింగ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చని కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ విధానాలను కూడా ప్రస్తావించారు. మొత్తంగా అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని అయితే అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఫిర్యాదుదారు కోరుతున్నారు. మరి పులివెందుల రింగ్ రోడ్డు విస్తరణలో చెట్ల నరికివేతపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?చెట్లను నరికివేస్తారా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి వాటిని సంరక్షిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనంతరం వినతికి ఆర్డిఓ చిన్నయ్య స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెట్లు నరికితే ఏదైనా అభివృద్ధికి మరల చెట్లు నాటాలని తీర్పులు ఉన్నాయని వాటిని అమలు చేయడం కోసం అధికారులతో మాట్లాడి మరల చెట్లు ఏర్పాటు చేసేలా చూస్తానని తెలిపారు..

ఆర్డిఓ చిన్నయ్యకు ప్రజల వినతి..

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రింగ్ రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు చెట్ల నరికివేతపై వివాదానికి దారితీస్తున్నాయి. రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 20 సంవత్సరాలుగా పెరిగిన చెట్లను నరికివేయకుండా వాటిని మరో ప్రాంతానికి తరలించి సంరక్షించాలని కోరుతూ పులివెందులకు చెందిన చిన్న నరసింహులు, సుబ్బారెడ్డి, రాము, అమీర్ బాష రెవెన్యూ డివిజన్ అధికారి చెన్నయ్యకు వినతి పత్రం అందజేశారు. రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం చెట్లను నరికివేస్తున్నారని దీనివల్ల పర్యావరణానికి, ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. నేషనల్ హైవే రైట్ ఆఫ్ వే అంటే ఆర్ఓడబ్ల్యూ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కోరారు. చెట్లను పూర్తిగా నరికివేయకుండా వాటిని 5 కిలోమీటర్ల పరిధిలోనే మరో ప్రాంతానికి తరలించి నాటాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేసి ముందుగా చెట్లను తరలించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను కోరారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని ఆదేశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రాజెక్టు ఉందన్న కారణంతో పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం సమంజసం కాదని అవసరమైన కనీస సంఖ్యలో మాత్రమే చెట్లను తొలగించేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొన్న విషయాన్ని ఫిర్యాదుదారు గుర్తుచేశారు. అలాగే రోడ్డు విస్తరణలో కూడా చెట్ల నరికివేతను తగ్గించే విధంగా వన్‌సైడ్ అక్విజిషన్ లేదా ఎక్సెంట్రిక్ వైడెనింగ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చని కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ విధానాలను కూడా ప్రస్తావించారు. మొత్తంగా అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని అయితే అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఫిర్యాదుదారు కోరుతున్నారు. మరి పులివెందుల రింగ్ రోడ్డు విస్తరణలో చెట్ల నరికివేతపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?చెట్లను నరికివేస్తారా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి వాటిని సంరక్షిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనంతరం వినతికి ఆర్డిఓ చిన్నయ్య స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెట్లు నరికితే ఏదైనా అభివృద్ధికి మరల చెట్లు నాటాలని తీర్పులు ఉన్నాయని వాటిని అమలు చేయడం కోసం అధికారులతో మాట్లాడి మరల చెట్లు ఏర్పాటు చేసేలా చూస్తానని తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.