Tuesday, 8 July 2025
  • Home  
  • రైతు ఉత్పత్తి దారుల శ్రేయస్సే నాబార్డు లక్ష్యం :నాబార్డ్ ఏజీఎం రవి సింగ్
- Featured

రైతు ఉత్పత్తి దారుల శ్రేయస్సే నాబార్డు లక్ష్యం :నాబార్డ్ ఏజీఎం రవి సింగ్

అనంతసాగరం మండలం: రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నాబార్డ్ ఏజీఎం రవి సింగ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు వాటాధనాన్ని ఎక్కువ పెంచుకుని ని షేర్ క్యాపిటల్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన యంత్ర పరికరాలు, పనిముట్లు ,విత్తనాలు మరియు ఎరువులు సస్యరక్షణ మందులు ఎఫ్ పి ఓ ల ద్వారా తెచ్చుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎఫ్ బి ఓ లకు నాబార్డు ద్వారా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని రైతులకు భూసార పరీక్షలు చేయిస్తామని రైతులకు కావలసిన ప్రాసెసింగ్ యూనిట్లు శీతల గిడ్డంగులు గోదాములు మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నాబార్డు వారు రైతు ఎఫ్ బి ఓ లకు బ్యాంకుల నుండి హార్టికల్చర్ అగ్రికల్చర్ తదితర శాఖల నుండి వచ్చే నిధులను ఇప్పించగలరని తెలిపారు. నాబార్డు ద్వారా కొన్ని స్కీములు 70 శాతం మరియు 50 శాతంలతో సహాయం చేయగలరు అని చెప్పినారు. ఈ సమావేశంలో అవార్డ్ ఎన్జీవో డైరెక్టర్ ఎం రమణ గారు మాట్లాడుతూ అనంతసాగరం రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణకు నాబార్డు వారి ఆర్థిక సహాయంతో మరియు సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సహకారంతో ఎఫ్ పి ఓ అన్ని విధాల ముందుకు తీసుకుపోగలమని మరియు ఎఫ్ డి ఓ లోని రైతులకు అవసరమయ్యే అన్ని ప్రయోజనాలను చేకూర్చాలని భరోసా ఇచ్చారు. ఎఫ్ బి ఓ యొక్క అధ్యక్షులు “అక్కల రెడ్డి అంకిరెడ్డి” గారు మాట్లాడుతూ వెనుకబడిన మా ప్రాంతమునకు నాబార్డు వారి సహాయంతో అవార్డు ఎన్జీవో వారు సంఘాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అందుకు ధన్యవాదాలు తెలియజేశారు .ఈ ఎస్ పి ఓ కు ముఖ్యంగా పండించే పంటలకు బొప్పాయి మిర్చి నిమ్మ మరియు తదితర పంటలను నిల్వ ఉంచుటకు కోల్డ్ స్టోరేజ్ లు మరియు సరుకు రవాణాకు వాహనమును మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు దళారీ వ్యవస్థ నుండి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో శాఖమూరి సుబ్బారావు గారు ,నర్రా వెంకట్రామయ్య, రామానుజుల రెడ్డి , పెంచల్ రెడ్డి, తదితర బి ఓ డి ఎస్ పాల్గొన్నారు. మరియు ఎఫ్ పి ఓ సి ఈ ఓ డి.శరత్ బాబు, అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ కె వాసు మరియు స్థానిక ఎన్జీవో కె. రమణయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

అనంతసాగరం మండలం: రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నాబార్డ్ ఏజీఎం రవి సింగ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు వాటాధనాన్ని ఎక్కువ పెంచుకుని ని షేర్ క్యాపిటల్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన యంత్ర పరికరాలు, పనిముట్లు ,విత్తనాలు మరియు ఎరువులు సస్యరక్షణ మందులు ఎఫ్ పి ఓ ల ద్వారా తెచ్చుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎఫ్ బి ఓ లకు నాబార్డు ద్వారా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని రైతులకు భూసార పరీక్షలు చేయిస్తామని రైతులకు కావలసిన ప్రాసెసింగ్ యూనిట్లు శీతల గిడ్డంగులు గోదాములు మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నాబార్డు వారు రైతు ఎఫ్ బి ఓ లకు బ్యాంకుల నుండి హార్టికల్చర్ అగ్రికల్చర్ తదితర శాఖల నుండి వచ్చే నిధులను ఇప్పించగలరని తెలిపారు. నాబార్డు ద్వారా కొన్ని స్కీములు 70 శాతం మరియు 50 శాతంలతో సహాయం చేయగలరు అని చెప్పినారు.

ఈ సమావేశంలో అవార్డ్ ఎన్జీవో డైరెక్టర్ ఎం రమణ గారు మాట్లాడుతూ అనంతసాగరం రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణకు నాబార్డు వారి ఆర్థిక సహాయంతో మరియు సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సహకారంతో ఎఫ్ పి ఓ అన్ని విధాల ముందుకు తీసుకుపోగలమని మరియు ఎఫ్ డి ఓ లోని రైతులకు అవసరమయ్యే అన్ని ప్రయోజనాలను చేకూర్చాలని భరోసా ఇచ్చారు.

ఎఫ్ బి ఓ యొక్క అధ్యక్షులు “అక్కల రెడ్డి అంకిరెడ్డి” గారు మాట్లాడుతూ వెనుకబడిన మా ప్రాంతమునకు నాబార్డు వారి సహాయంతో అవార్డు ఎన్జీవో వారు సంఘాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అందుకు ధన్యవాదాలు తెలియజేశారు .ఈ ఎస్ పి ఓ కు ముఖ్యంగా పండించే పంటలకు బొప్పాయి మిర్చి నిమ్మ మరియు తదితర పంటలను నిల్వ ఉంచుటకు కోల్డ్ స్టోరేజ్ లు మరియు సరుకు రవాణాకు వాహనమును మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు దళారీ వ్యవస్థ నుండి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో శాఖమూరి సుబ్బారావు గారు ,నర్రా వెంకట్రామయ్య, రామానుజుల రెడ్డి , పెంచల్ రెడ్డి, తదితర బి ఓ డి ఎస్ పాల్గొన్నారు. మరియు ఎఫ్ పి ఓ సి ఈ ఓ డి.శరత్ బాబు, అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ కె వాసు మరియు స్థానిక ఎన్జీవో కె. రమణయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

Send us message

పున్నమి  @2025. All Rights Reserved.