రైతు ఆశీర్వాద సభకు ప్రజలు తరలిరావాలి.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్.
జులై 10 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు.
చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభకు ప్రజలు తరలిరావాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కోరారు. గురువారం స్థానిక కమ్మవారి కల్యాణ మండపంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విడుదల చేసే రుణమాఫీ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఇంచార్జ్ రాంపొడి రోశయ్య,సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరామ్ నాయక్, మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు ప్రభావతి రెడ్డి, సామేలు, సర్పంచులు భూక్య లక్ష్మ, దానసరి నవీన్, అజ్మీర సురేష్, నాయక్ రామకోటి ,ఇంజo శేషగిరిరావు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలూ నాయక్, సక్రు నాయక్, నాయకులు మేడ ధర్మారావు, ముక్తి వెంకటేశ్వర్లు, గాలిబ్ సాహెబ్, గుర్రం రవి, పూర్ణ కంటి మైసరావు, గోళ్ళ చిన్నస్వామి, తదితరులు పాల్గొన్నారు.


