ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధి లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ వారి సౌజన్యం తో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొని రైతులకు మార్గదర్శక సూచనలు అందించారు. ఆమె మాట్లాడుతూ — రైతులు ఆధునిక పద్ధతుల్లోవ్యవసాయం చేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవాలని, ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రైతుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి