Monday, 18 May 2026
  • Home  
  • రైతన్నకు ధైర్యం… సేంద్రియ సాగుకు సౌమ్య మద్దతు భూముల్లోకే దిగి రైతుతో మమేకం – పథకాలపై అవగాహన కల్పించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

రైతన్నకు ధైర్యం… సేంద్రియ సాగుకు సౌమ్య మద్దతు భూముల్లోకే దిగి రైతుతో మమేకం – పథకాలపై అవగాహన కల్పించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

ఆవిరిపన్లు తగ్గని వేళ… “రైతన్న మీకోసం” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం రైతులతో కలసి భూముల్లోకి అడుగుపెట్టారు. స్థానిక రైతు సాగు చేస్తున్న సేంద్రియ పద్ధతులను పరిశీలించిన ఆమె, పంట పెంపకం నుంచి దిగుబడులదాకా సాగు విధానాలపై సవివరంగా ఆరాతీశారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పురుగుమందుల నియంత్రణ, వ్యయాలు, మార్కెటింగ్ అంశాలపై రైతుతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని, సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య స్పష్టం చేశారు. సబ్సిడీలు, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ మద్దతు తదితర పథకాలను రైతులకు వివరించారు. రైతు నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని ఆమె స్పష్టంగా చెప్పి, సేంద్రియ సాగుతో భూమి సారానికి రక్షణ కలిగిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి అవగాహన కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆవిరిపన్లు తగ్గని వేళ… “రైతన్న మీకోసం” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం రైతులతో కలసి భూముల్లోకి అడుగుపెట్టారు. స్థానిక రైతు సాగు చేస్తున్న సేంద్రియ పద్ధతులను పరిశీలించిన ఆమె, పంట పెంపకం నుంచి దిగుబడులదాకా సాగు విధానాలపై సవివరంగా ఆరాతీశారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పురుగుమందుల నియంత్రణ, వ్యయాలు, మార్కెటింగ్ అంశాలపై రైతుతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని, సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య స్పష్టం చేశారు. సబ్సిడీలు, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ మద్దతు తదితర పథకాలను రైతులకు వివరించారు.

రైతు నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని ఆమె స్పష్టంగా చెప్పి, సేంద్రియ సాగుతో భూమి సారానికి రక్షణ కలిగిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి అవగాహన కరపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.