వార్త ముఖ్యాంశాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు, 20న జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి.
- నిశాంతి తెలిపారు.
- ఎంపీపీ ఎన్నికలు సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీ ఎన్నికలు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు, 20న జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి తెలిపారు. ఎంపీపీ ఎన్నికలు సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీ ఎన్నికలు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 1 గంటకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏకైక అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన