Saturday, 5 September 2026
  • Home  
  • రేణిగుంట గంగమ్మ జాతరలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి

రేణిగుంట గంగమ్మ జాతరలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి

రేణిగుంట ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి అమ్మవారికి సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతం:గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. రేణిగుంటలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక యువత, నాయకులు, భక్తులు బాణసంచా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ, పూలు, పండ్లతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి సేవలో పాల్గొని సారె సమర్పించే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని,శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐక్యమత్యంతో ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు

రేణిగుంట ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి

అమ్మవారికి సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతం:గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.
రేణిగుంటలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక యువత, నాయకులు, భక్తులు బాణసంచా ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ, పూలు, పండ్లతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అమ్మవారి సేవలో పాల్గొని సారె సమర్పించే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని,శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐక్యమత్యంతో ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.