Tuesday, 30 June 2026
  • Home  
  • రేణిగుంటలో లోకేష్ సభా ఏర్పాట్ల పరిశీలన
- తిరుపతి

రేణిగుంటలో లోకేష్ సభా ఏర్పాట్ల పరిశీలన

శ్రీ కాళహస్తి, జూన్ 29, (పున్నమి న్యూస్) : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జూలై 1న శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట వద్ద ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను సోమవారం నియోజకవర్గ ముఖ్య నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన పార్టీ కుటుంబ సభ్యులతో లోకేష్ రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయనున్నారు. సుధీర్ రెడ్డి నాయకత్వంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ జి.దశరథాచారి, ఎం.సుబ్బయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, బీసీ విభాగం నేత డాక్టర్ ఎం.ఉమేష్ రావు, పట్టణ కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.