అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రెడ్డమ్మ దేవత ఆలయ అభివృద్ధి పనులకు రూ.25 వేల విరాళం అందింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సహకరించేందుకు వైఎస్సార్ కడప జిల్లా కోఆపరేటివ్ కాలనీకి చెందిన ఎం. భాస్కర్ రెడ్డి విరాళాన్ని అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. విరాళ మొత్తాన్ని వాయల్పాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొంటూ ఆలయ చైర్మన్ శ్రీలంకిపల్లి రాజన్న నాయుడు, ఈఓ మంజుల కృతజ్ఞతలు తెలిపారు.

రెడ్డమ్మ ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం