Saturday, 26 September 2026
  • Home  
  • రూ.70 లక్షల సీజీఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి
- నిర్మల్

రూ.70 లక్షల సీజీఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి

జగదాంబ సేవాలాల్, హనుమాన్ ఆలయాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి కుభీర్: మండలంలోని డోడర్న-1 రామ్ నాయక్ తండాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.51 లక్షలతో పునర్నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డోడర్న గ్రామంలో సీజీఎఫ్ నిధులు రూ.19 లక్షలతో నిర్మించిన శ్రీ హనుమాన్ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జగదాంబ, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను, ఆలయ కమిటీ సభ్యులను, గ్రామ ప్రజలను ఎమ్మెల్యే అభినందించారు. ఆధ్యాత్మికతతో పాటు గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జగదాంబ సేవాలాల్, హనుమాన్ ఆలయాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
కుభీర్: మండలంలోని డోడర్న-1 రామ్ నాయక్ తండాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.51 లక్షలతో పునర్నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం డోడర్న గ్రామంలో సీజీఎఫ్ నిధులు రూ.19 లక్షలతో నిర్మించిన శ్రీ హనుమాన్ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జగదాంబ, స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను, ఆలయ కమిటీ సభ్యులను, గ్రామ ప్రజలను ఎమ్మెల్యే అభినందించారు. ఆధ్యాత్మికతతో పాటు గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.