Thursday, 1 October 2026
  • Home  
  • రామవరం లో మెయిన్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

రామవరం లో మెయిన్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 30: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జాతీయ రహదారి నుండి ముత్యాలమ్మ చెరువు వరకు నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కిలోమీటర్ మేర కాలినడకన రోడ్డు వెంబడి నడుస్తూ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నాణ్యత, కొలతలు, మెటీరియల్ వినియోగంపై అధికారులను ప్రశ్నించారు.గ్రామస్తుల నుంచి వచ్చిన అభ్యర్థనలు , సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ అండ్ బి డీఈ కేఎస్ రాఘవరావు, కాంట్రాక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజాధనంతో చేసే పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, అంచనాలకు తగ్గట్టుగా పకడ్బందీగా రోడ్డు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రామవరం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ సర్పంచ్ మండపాక చిన్న, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, సీనియర్ వార్డు సభ్యులు మండపాక వెంకటేశ్వరరావు( మణికంఠ), జనసేన మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ దొడ్డ శ్రీను టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 30:

జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జాతీయ రహదారి నుండి ముత్యాలమ్మ చెరువు వరకు నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కిలోమీటర్ మేర కాలినడకన రోడ్డు వెంబడి నడుస్తూ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నాణ్యత, కొలతలు, మెటీరియల్ వినియోగంపై అధికారులను ప్రశ్నించారు.గ్రామస్తుల నుంచి వచ్చిన అభ్యర్థనలు , సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ అండ్ బి డీఈ కేఎస్ రాఘవరావు, కాంట్రాక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజాధనంతో చేసే పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, అంచనాలకు తగ్గట్టుగా పకడ్బందీగా రోడ్డు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రామవరం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మాజీ సర్పంచ్ మండపాక చిన్న, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, సీనియర్ వార్డు సభ్యులు మండపాక వెంకటేశ్వరరావు( మణికంఠ), జనసేన మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ దొడ్డ శ్రీను టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.