లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో పొలాల అమావాస్య వేడుకలను గ్రామస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి తమ తమ ఆవులను అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.
గ్రామంలోని ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్యను జరుపుకున్నారు. ఆవులను ఆలయం చుట్టూ తిప్పడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ వేడుకల్లో గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని పొలాల అమావాస్యను ఇలా సామూహికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

రాజుర గ్రామంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు
లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో పొలాల అమావాస్య వేడుకలను గ్రామస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి తమ తమ ఆవులను అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. గ్రామంలోని ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్యను జరుపుకున్నారు. ఆవులను ఆలయం చుట్టూ తిప్పడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ వేడుకల్లో గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని పొలాల అమావాస్యను ఇలా సామూహికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

