తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం
రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్ గురువారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి చింతా.అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం ఈ.డి అల్లవరం మండలం మొగళ్ళమూరు లోని ఎం.పి స్వగృహంలో ఎం.పి.అనురాధను కలిశారు.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు నూతన ఈ.డి కి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఈ.డి తో పాటు హెచ్.ఆర్ జీ.ఎం దినేష్ జైన్ ,సీజిఎమ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.