NFHS-6 ప్రాథమిక ఫలితాల్లో రక్తహీనత (అనీమియా) సూచికను తొలగించడం నిపుణుల్లో చర్చకు దారితీసింది. గత సర్వేల ప్రకారం పిల్లలు, మహిళలు, గర్భిణుల్లో రక్తహీనత శాతం పెరుగుతూ వచ్చింది. అయితే అనీమియా కొలిచే విధానంపై వచ్చిన సందేహాల కారణంగా ఈ సూచికను తాత్కాలికంగా తొలగించినట్లు సమాచారం. వేళ్ల నుంచి తీసిన రక్త నమూనాల ఆధారంగా చేసిన కొలతలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దేశంలో పోషకాహార లోపం పరిస్థితిని అంచనా వేయడంలో అనీమియా ఒక ముఖ్యమైన సూచిక కావడంతో దీన్ని తొలగించడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రక్తహీనత సూచిక తొలగింపుపై నిపుణుల ఆందోళన