మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అటవీ డివిజన్ ఇంధన్ పల్లి నాయకపుగూడకు చెందిన ఆదివాసి యువకులపై దాడి చేసిన అటవీశాఖ రేంజి అధికారి లక్ష్మీనారాయణని సస్పెండ్ చేయాలని తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లిన ఆరుగురు యువకులపై అధికారులు దాడి చేసి దుర్భాషలాడి అనంతరం యువకులను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమాయకులైన ఆదివాసీ యువకులపై అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఫారెస్ట్ అధికారుల తీరును తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అడవిని నమ్ముకుని జీవనం కొనసాగించే ఆదివాసీలపై అధికారులు ప్రతాపం ప్రదర్శించడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యువకుల పై దాడికి పాల్పడిన అటవీ శాఖ అధికారులని సస్పెండ్ చేయాలి