ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, నాగసముద్రం, కృష్ణారెడ్డిపాలెం, వెలగపాడు ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను తవ్వేస్తుండటంతో చెరువులు, వాగులు, ప్రభుత్వ భూములు గుల్లవుతున్నాయి.
అనుభవం, లైసెన్స్ లేని డ్రైవర్లు రాత్రింబవళ్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై తహసీల్దారు గిరీష్ స్పందిస్తూ, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైన రైతులకు, గృహ నిర్మాణాలకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు.


