*ఎన్టీఆర్ జిల్లా మైలవరం*
*మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్స్*
3 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 9 న జరిగిన అధ్యాయం దురదృష్టకరం
తమ పైన బురద ఎదుటి వారికి పూయాలనే పైశాచిక ఆనందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ని అన్యాయంగా అక్రమంగా జైలుకి తరలించారు
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు కూటమి ఏర్పాటుకి కారణమైంది, భస్మాసురుడి నాశనానికి నాంది పలికింది
ఆంద్ర రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు కి నైతికంగా మద్దతుగా నిలిచారు
ఒక ప్రజా నాయకుడిని ఉద్దేశ్య పూర్వకంగా అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఫలితమేంటో ప్రజలు చూపారు
దీపావళి రోజున నరకాసురుడి వినాశనాన్ని బాణాసంచా తో ఎలా నిర్వహిస్తామో, అదేవిధంగా 53 కొవ్వొత్తులతో నేటి సాయంత్రం కార్యక్రమాలు నిర్వహిస్తాము
అప్పటి వైసీపీ ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా నేను ఉన్న సమయంలో ఎమ్మెల్యే లు అంతా ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబు కి వ్యతిరేకంగా మాట్లాడమని పాంఫ్లెట్ లు పంపారు
కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు, చంద్రబాబు కి మద్దతుగా ఏ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోమని చెప్పలేదు
అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనే దానికి ఇదొక ఉదాహరణ
తాను చేసిన తప్పుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కేవలం మీట నొక్కితే ప్రజలు ఓటేస్తారని అనుకున్న గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేయలేకపోయాము
ఈ ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌళిక వసతుల కల్పన పనులు పరుగులు పెడుతున్నాయి
అంతర్గత రహదారులకు కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయి
సుమారు 75 లక్షల రూపాయల నిధులతో మైలవరం నారాయణ నగర్ వద్ద బుడమేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయి
కళ్ళుండి చూడలేని కబోదులకు మనం ఏమీ చెప్పలేము, జీవితకాలం లో అన్ని పార్టీలు మారినవాళ్ళు కూడా అవాకులు, చవాకులు పేలుతారు
అత్త విధవ అయితే కోడలు సంసారం చేస్తుంటే చూడలేని విధంగా ప్రవర్తిస్తుంటారు
లీడర్షిప్ కాన్క్లేవ్ అనేది ఒక దార్శనిక కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా విమర్శించారంటే అది వాళ్ళ మందబుద్దికి నిదర్శనం
ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి, ప్రతి కుక్క కి మనం సమాధానం చెప్పలేము
ఎన్నికల కమీషన్ ప్రక్రియ మేరకు కూటమి ప్రభుత్వం కలిసి పని చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమౌతాము
100శాతం స్ట్రైక్ రేట్ తో విజయాలు సాధిస్తాం
ఏ ఒక్క నాయకుడు కూటమి కి వ్యతిరేకంగా పనిచేసినా కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు



