*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*
*మైలవరంలో ‘సేవా సంకల్ప యాత్ర’కు ఘన స్వాగతం*
*మోదీ గారి 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్ యాత్ర*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, అక్టోబర్ 2:*
*ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్), తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’ శుక్రవారం మైలవరానికి చేరుకుంది.*
*మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు యాత్రలో పాల్గొంటున్న బైక్ రైడర్లకు ఘన స్వాగతం పలికారు. వారికి ఆతిథ్యం అందించి, యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.*
*టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, మంత్రి నారా లోకేశ్ గారి సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ యాత్రలో 25 మంది బైక్ రైడర్లు పాల్గొంటున్నారు.*
*తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీవారి ఆశీస్సులతో ప్రారంభమైన యాత్ర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు ఎనిమిది రోజుల పాటు సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకోనుంది.*
*పవిత్ర క్షేత్రాల సందర్శన*
*యాత్రలో భాగంగా మార్గమధ్యంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు పవిత్ర నదుల నుంచి జలాలను సేకరించి వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, యువ నేతలు యాత్రలో భాగస్వాములవుతున్నారు.*
*ప్రజాసేవకు ప్రతీకగా మోదీ గారు, చంద్రబాబు గారు.*
*ప్రజా జీవితంలో నిబద్ధతతో పనిచేసే నాయకత్వానికి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు నిదర్శనమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం, ప్రజా సేవ కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపార*




