Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేమింతే.. మారమంతే.. రోస్ట్‌–7లో కల్తీ కలకలం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేమింతే.. మారమంతే.. రోస్ట్‌–7లో కల్తీ కలకలం!

వార్త ముఖ్యాంశాలు

  • రోస్ట్‌–7 హోటల్‌లో అపరిశుభ్ర ఆహార పదార్థాలు..
  • గడువు ముగిసిన పాల ప్యాకెట్లు స్వాధీనం నెల్లూరు: నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు.
  • ఆహార భద్రత, నగరపాలక సంస్థ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

రోస్ట్‌–7 హోటల్‌లో అపరిశుభ్ర ఆహార పదార్థాలు.. గడువు ముగిసిన పాల ప్యాకెట్లు స్వాధీనం

నెల్లూరు: నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు. ఆహార భద్రత, నగరపాలక సంస్థ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా గురువారం హరనాథపురంలోని రోస్ట్‌–7 హోటల్‌లో నగరపాలక సంస్థ ఎంహెచ్‌ఓ దినేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, వారం రోజులుగా నిల్వ ఉంచిన చికెన్‌, ఐదు రోజుల క్రితం తయారు చేసిన చికెన్‌ కూరలు ఫ్రీజర్లలో ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు కాలం చెల్లిన బ్రెడ్‌, ఇతర ఆహార పదార్థాలు కూడా నిల్వ ఉంచినట్లు పరిశీలనలో వెల్లడైంది.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే నిర్వీర్యం చేసి డంపింగ్‌ యార్డుకు తరలించారు. హోటల్‌ నిర్వాహకులకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా ఉల్లంఘనలు గుర్తిస్తే హోటల్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

అధికారుల తనిఖీలు, జరిమానాలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ కొన్ని హోటళ్ల నిర్వహణలో మార్పు రాకపోవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *