Saturday, 12 September 2026
  • Home  
  • *మెగా డీఎస్సీ పై వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ర్యాలీ
- తిరుపతి

*మెగా డీఎస్సీ పై వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ర్యాలీ

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 28 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఆర్ కే రోజ హాజరై సంఘీభావం ప్రకటించారు. ర్యాలీ అనంతరం వారు డీఎస్సీ అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి చంద్రగిరి, తిరుపతి నియోజక వర్గాల నుంచి విద్యార్థి, యువజన నాయకులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైనా మెగా డీఎస్సీలో జరిగిన అవగతవకలు బయటపడాలంటే సిబిఐతో ఎంక్వయిరీ చేపించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుందనీ వారన్నారు.

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 28

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఆర్ కే రోజ హాజరై సంఘీభావం ప్రకటించారు. ర్యాలీ అనంతరం వారు డీఎస్సీ అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి చంద్రగిరి, తిరుపతి నియోజక వర్గాల నుంచి విద్యార్థి, యువజన నాయకులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైనా మెగా డీఎస్సీలో జరిగిన అవగతవకలు బయటపడాలంటే సిబిఐతో ఎంక్వయిరీ చేపించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుందనీ వారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.