మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, 500 మంది యువత , నిరుద్యోగులతో విఆర్సి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .
యువత నిరుద్యోగుల నిరసనల తో అట్టుడికిన కలెక్టరేట్.
—————————–
మెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారని ప్రభుత్వం పై విరుచుకుపడ్డ .ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మెగా డీఎస్సీపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు విఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు హాజరై.. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన నిరసన ర్యాలీలో సుమారు 500 మంది యువత పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు .
👉 కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ అక్రమాలమయంగా మారిందని..ద్వజమేత్తారు
👉 మెగా డీఎస్పీలో దగాపడ్డ అభ్యర్థుల పక్షాన నిలిచి.. ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని.. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిదేళ్ళ కిషన్ మెగా డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ.. DRO గారికి వినతి పత్రం అందజేశారు.
• ప్రభుత్వం పారదర్శకత లేకుండా మెగా డీఎస్సీని నిర్వహించి అక్రమాలకు తెరలేపిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు.
* ప్రభుత్వ యంత్రాంగం అక్రమాలతో మూడున్నర లక్షల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
* దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుందన్నారు.




