శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి న్యూస్): మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాలను మిక్కిలి కలచివేసింది. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేసిన ఆయన దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజల నమ్మకాన్ని పొందిన నాయకుడిగా నిలిచారు. శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన సమాజ సమస్యలపై చూపిన నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొట్టే సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు.

ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్రానికి తీరని లోటు- కొట్టే సాయి ప్రసాద్