Saturday, 12 September 2026
  • Home  
  • ముఖ్యమంత్రి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి వినతి-గొడ్డేరు వంతెన పనులపై చర్చ
- తిరుపతి

ముఖ్యమంత్రి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి వినతి-గొడ్డేరు వంతెన పనులపై చర్చ

శ్రీ కాళహస్తి, ఆగస్టు 30, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పర్యటన నిమిత్తం ఆదివారం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ ఒక సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతిపత్రంలో ప్రధానంగా పట్టణంలోని గుడ్డేరు కాలువపై నూతనంగా నిర్మించ తలపెట్టిన భారీ వంతెన (బ్రిడ్జి) నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల దర్శనార్థం దేశ నలుమూలల నుండి నిత్యం వచ్చే లక్షలాది మంది భక్తులకు, వాహనదారులకు ఈ వంతెన నిర్మాణం పూర్తయితే పాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యల నుండి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని వివరించారు. దీనితో పాటు స్థానిక రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ అందజేసిన వినతిపత్రాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యార్థం ఈ వంతెన నిర్మాణ అవశ్యకతను గుర్తించి, సంబంధిత దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన నిధులు, అనుమతులు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాధాన్యత కలిగిన సమావేశంలో దేవస్థాన పాలకమండలి ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.