Wednesday, 23 September 2026
  • Home  
  • మిషన్‌ భగీరథ నీళ్లు కరువు.. సోలార్‌ ట్యాంక్‌తో ఇంద్రానగర్‌ ప్రజల అవస్థలు
- ASIFABAD

మిషన్‌ భగీరథ నీళ్లు కరువు.. సోలార్‌ ట్యాంక్‌తో ఇంద్రానగర్‌ ప్రజల అవస్థలు

హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో తాగునీటి కష్టాలు..! ట్యాంక్‌ నీటి నాణ్యతపై గ్రామస్తుల ఆందోళన ఆసిఫాబాద్, ఆగస్టు 20: వాంకిడి మండలం బంబారా గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్థానికులు చెబుతున్నారు. హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో ఇబ్బందులు ఇంద్రానగర్‌ వాసులకు గతంలో తాగునీటికి ప్రధాన ఆధారంగా ఉన్న హ్యాండ్‌పంప్‌ను తొలగించి, దాని స్థానంలో సోలార్‌ ట్యాంక్‌ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. అయితే సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణ, పరిశుభ్రతపై సరైన శ్రద్ధ లేకపోవడంతో నీటి నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌ నీటిని వినియోగిస్తున్న కొందరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేని సమయంలో హ్యాండ్‌పంప్‌ కొంతవరకు ఉపశమనం కలిగించేదని, దానిని తొలగించడంతో ప్రత్యామ్నాయ నీటి వనరు లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. గోండు కొసరాలోనూ నీటి కష్టాలు గోండు కొసరా ప్రాంతంలో కూడా మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. వేసవి కాలంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని, అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. హ్యాండ్‌పంప్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ట్యాంక్‌లోని నీటి నాణ్యతపై అధికారులు పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇంద్రానగర్‌లో తొలగించిన హ్యాండ్‌పంప్‌ను తిరిగి ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు హ్యాండ్‌పంప్‌ను అందుబాటులో ఉంచాలని, సోలార్‌ ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరిచి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో తాగునీటి కష్టాలు..! ట్యాంక్‌ నీటి నాణ్యతపై గ్రామస్తుల ఆందోళన
ఆసిఫాబాద్, ఆగస్టు 20: వాంకిడి మండలం బంబారా గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్థానికులు చెబుతున్నారు.
హ్యాండ్‌పంప్‌ తొలగించడంతో ఇబ్బందులు
ఇంద్రానగర్‌ వాసులకు గతంలో తాగునీటికి ప్రధాన ఆధారంగా ఉన్న హ్యాండ్‌పంప్‌ను తొలగించి, దాని స్థానంలో సోలార్‌ ట్యాంక్‌ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. అయితే సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణ, పరిశుభ్రతపై సరైన శ్రద్ధ లేకపోవడంతో నీటి నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌ నీటిని వినియోగిస్తున్న కొందరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేని సమయంలో హ్యాండ్‌పంప్‌ కొంతవరకు ఉపశమనం కలిగించేదని, దానిని తొలగించడంతో ప్రత్యామ్నాయ నీటి వనరు లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.
గోండు కొసరాలోనూ నీటి కష్టాలు
గోండు కొసరా ప్రాంతంలో కూడా మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. వేసవి కాలంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని, అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
హ్యాండ్‌పంప్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌
సోలార్‌ ట్యాంక్‌ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ట్యాంక్‌లోని నీటి నాణ్యతపై అధికారులు పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇంద్రానగర్‌లో తొలగించిన హ్యాండ్‌పంప్‌ను తిరిగి ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు హ్యాండ్‌పంప్‌ను అందుబాటులో ఉంచాలని, సోలార్‌ ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరిచి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇంద్రానగర్‌, గోండు కొసరా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.