ఇటీవల ఆసుపత్రిలో వంట చేసే అరుణ ప్రమాదవశాత్తు కుక్కర్ పేలి గాయపడడం జరిగింది. వెంటనే సిబ్బంది స్పందించి చికిత్స అందించారు.అరుణ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, వారి భర్త కొన్నిరోజుల క్రితం చనిపోవడం. ఇది తెలుసుకున్న సిబ్బంది మరియు కాంట్రాక్టర్ హన్మండ్లు గారు కొంత డబ్బులు పోగు చేసి ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.అనిల్ కుమార్ జాదవ్ గారు, ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసి మానవత్వం చాటుకున్న డాక్టర్లకు, సిబ్బందికి, కాంట్రాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. మల్లికార్జున్, డా.సాయి సువర్ధన్, నర్సింగ్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్, టిబీ సూపర్వైజర్ లాలయ్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న ముధోల్ ఆసుపత్రి సిబ్బంది