పున్నమి: రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్: మాధవ నగర్: మాధవ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ తోపాటు వాస్తు జంగారెడ్డి, దిండి నారాయణరెడ్డి, పురుషోత్తం రెడ్డి, లక్ష్మారెడ్డి, విక్రమ్ రాజు, రాజేందర్ రెడ్డి, ముత్యాలు, మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ, కడారి రాజేష్ యాదవ్, బొడ్ల మల్లికార్జున్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
కాలనీ సభ్యులు భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు నిర్వహించి, ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



