పొట్టిపాడు (గన్నవరం నియోజకవర్గం): పున్నమి ప్రతినిధి సురేష్
స్థానిక గ్రామంలో పొట్టిపాడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిఖిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖులు ఘనంగా ప్రారంభించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సేవా స్ఫూర్తితో, యలమర్తి అర్లప్ప మరియు గుడ్డేటి సుధాకర్ జ్ఞాపకార్థం తో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి యార్లగడ్డ సతీష్ బాబు, ఉంగుటూరు మండల అధ్యక్షులు కొలుసు రవీంద్ర, కుందేటి చంద్రశేఖర్, PACS చైర్మన్ అట్లూరి జోషి మధు, గుడ్డేటి సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి నిఖిల్ ముందుండి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
పాల్గొన్న వారు:
గ్రామ పార్టీ అధ్యక్షులు ఈసరి రవి, మహిళా అధ్యక్షురాలు పొదిలి మధులత, విద్యా కమిటీ చైర్మన్ కాండ్రు రమేష్, ఎక్స్ ఎంపీటీసీ కడియాల శ్రీను, ఎక్స్ సర్పంచ్ గుండపనేని శ్రీధర్, సర్పంచ్ కత్తుల బోస్, సీతయ్య, తమలం నాని మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


