గన్నవరం, మే 21: పున్నమి ప్రతినిధి సురేష్
హనుమాన్ జంక్షన్, ఏలూరు రోడ్డులోని ఎస్‌వీ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి స్వీట్స్ అధినేత స్వర్గీయ కొల్లి వెంకట పూర్ణ చంద్రరావు దశదిన కర్మ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పరేషన్ (APRDC) డైరెక్టర్, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నేత గరికిపాటి శివశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వర్గీయ పూర్ణ చంద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గరికిపాటి శివశంకర్ మాట్లాడుతూ… వ్యాపార రంగంలో కొల్లి వెంకట పూర్ణ చంద్రరావు తనదైన ముద్ర వేసుకున్నారని, కష్టపడే తత్వంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి మరణం కుటుంబానికే కాకుండా, స్థానిక వ్యాపార రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
అనంతరం పూర్ణ చంద్రరావు కుటుంబ సభ్యులను గరికిపాటి శివశంకర్ పరామర్శించి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి శివశంకర్ సరసన స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


