శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన వాధి కోటేశ్వరరావు, లత దంపతుల కుమార్తె సాయి దీపిక వివాహానికి అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులు సాయి దీపిక, సాయి కృష్ణలను కలిసి ఆశీర్వదించారు. దంపతులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మన్నవరం గ్రామానికి చెందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కూటమి సీనియర్ నాయకుడు రాంబాబు నాయుడు నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా రాంబాబు నాయుడుతో కలిసి వారి వ్యవసాయ పొలాన్ని సందర్శించి కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. గ్రామీణ వాతావరణంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి గడపడం ఆనందంగా అనిపించిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

మన్నవరంలో నూతన దంపతులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆశీస్సులు