మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కామ్‌జాంగ్ జిల్లాలోని కులుత్ గ్రామంలో గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక కుకీ వ్యక్తి, ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు మే 13న అపహరణకు గురైన ఆరుగురు నాగాల మృతదేహాలు లభించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఆగ్రహించిన ప్రజలు సేనాపతి జిల్లాలో నాగాలాండ్‌కు చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో యునైటెడ్ నాగా కౌన్సిల్ 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.. ఇద్దరు మృతి