ఉదయగిరి, సెప్టెంబర్ 28: ఉదయగిరి నియోజకవర్గానికి తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సభా ప్రాంగణం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లు, పార్టీ జెండాలతో అలంకరిస్తున్నారు.
సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి కొట్టే వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్కింగ్, రాకపోకలు, సభా ప్రాంగణంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Uploaded Video:

