భవననిర్మాణ కార్మికునికి ఆర్ధిక చేయుత.
గతవారం నెల్లూరు . వెంకటేశ్వరపురం లో బిల్డింగ్ కి పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు రెండవ అంతుస్తు నుండి క్రింద పడి తీవ్రంగా గాయపడిన రాచగిరి చెంచయ్య యొక్క ధీనస్ధితిని తెలుసుకుని వారి కుటుంబానికి రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు మరియు 1000/- రూపాయలు వారి నివాసం ఆయిన ధీన్ ధయాళ్ నగర్ కు వెళ్లి ఇవ్వడం జరిగింది. మరియు వారి ఇద్దరు పిల్లలను (బడి మానేసారు) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని పులి చెంచయ్య SC/ST గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.అలాగే ఈ సంఘటన వాట్సాప్ లో చూసి వెంటనే స్పందించిన పోచరెడ్డి సురేష్ మరియు సింగపూర్ కమ్యూనిటి అసిస్టెన్స్ గ్రూపు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు అరవ రత్నం(CI excise) . మల్లికార్జున గారు . స్ధానిక భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు సర్తాజ్ . రఫీ . దస్తగిరి. మరియరాజు. ఆవుల ప్రణీత్ స్ధానిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.