Friday, 24 July 2026
  • Home  
  • భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. ప్రధాని మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రల దిష్టిబొమ్మ దహనం
- కామారెడ్డి

భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. ప్రధాని మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రల దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, 22జులై, ( పున్నమి ప్రతినిధి ) : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టు ను నిరసిస్తూ,రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ (పీసీసీ) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం రామారెడ్డి మండ ల బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ,ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మను దహనం చేశారు.విద్యార్థుల భవి ష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్రం… రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకి లచ్చయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్ర టరీ శ్రీ రంగు రవీందర్ గౌడ్, డైరెక్టర్ రావుఫ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నామాల రవి, మండల యూత్ ప్రెసిడెంట్ రంజిత్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అద్వాన్, మండల బిసి సెల్ అధ్యక్షుడు జెసిబి శేఖర్, యూ త్ వైస్ ప్రెసిడెంట్ జాషువా తదితరు లు పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థుల హక్కుల కోసం, నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ప్రశ్ని స్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్ర మంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిం చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని, పేపర్ లీకేజీలను అరికట్టడంలో ఘోరంగా విఫల మైందని మండిపడ్డారు. అక్రమాలను అరికట్టి బా ధ్యులపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించే గొంతు లను నొక్కేందుకు నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్య నేతలు, కార్యక ర్తల భారీ భాగస్వామ్యం…ఈ నిరసన కార్యక్ర మంలో వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, ఈసాయి పేట హరీష్, కన్నాపూర్ తాండ యూత్ అధ్యక్షుడు మైపాల్, సుమన్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకులు, యువజన, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొ న్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల ఉజ్వ ల భవిష్యత్తు మరియు హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

కామారెడ్డి, 22జులై, ( పున్నమి ప్రతినిధి ) :

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టు ను నిరసిస్తూ,రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ (పీసీసీ) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం రామారెడ్డి మండ ల బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ,ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మను దహనం చేశారు.విద్యార్థుల భవి ష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్రం… రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకి లచ్చయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్ర టరీ శ్రీ రంగు రవీందర్ గౌడ్, డైరెక్టర్ రావుఫ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నామాల రవి, మండల యూత్ ప్రెసిడెంట్ రంజిత్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అద్వాన్, మండల బిసి సెల్ అధ్యక్షుడు జెసిబి శేఖర్, యూ త్ వైస్ ప్రెసిడెంట్ జాషువా తదితరు లు పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థుల హక్కుల కోసం, నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ప్రశ్ని స్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్ర మంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిం చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని, పేపర్ లీకేజీలను అరికట్టడంలో ఘోరంగా విఫల మైందని మండిపడ్డారు. అక్రమాలను అరికట్టి బా ధ్యులపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించే గొంతు లను నొక్కేందుకు నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్య నేతలు, కార్యక ర్తల భారీ భాగస్వామ్యం…ఈ నిరసన కార్యక్ర మంలో వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, ఈసాయి పేట హరీష్, కన్నాపూర్ తాండ యూత్ అధ్యక్షుడు మైపాల్, సుమన్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకులు, యువజన, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొ న్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల ఉజ్వ ల భవిష్యత్తు మరియు హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.