Sunday, 16 August 2026
  • Home  
  • భగత్ సింగ్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- రంగారెడ్డి

భగత్ సింగ్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భగత్ సింగ్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ భగత్ సింగ్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆలంపల్లి నర్సింహా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం అనేది ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు, యువకులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమసమాజ నిర్మాణం కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్, మాజీ వార్డు సభ్యులు గడ్డం కుమార్, జమ్మ మహేందర్,, భగత్ సింగ్ కాలనీ సభ్యులు, స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశభక్తి నినాదాలతో కాలనీ మార్మోగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీలోని ప్రజలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి, సామాజిక బాధ్యత మరింత పెంపొందించే విధంగా కార్యక్రమం కొనసాగింది. ఈ వేడుకలు కాలనీ ప్రజల్లో ఐక్యతను, దేశభక్తి భావాన్ని చాటిచెప్పేలా ఘనంగా జరిగాయి.

భగత్ సింగ్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

భగత్ సింగ్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలంపల్లి నర్సింహా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం అనేది ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు, యువకులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమసమాజ నిర్మాణం కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్, మాజీ వార్డు సభ్యులు గడ్డం కుమార్, జమ్మ మహేందర్,, భగత్ సింగ్ కాలనీ సభ్యులు, స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశభక్తి నినాదాలతో కాలనీ మార్మోగింది.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీలోని ప్రజలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి, సామాజిక బాధ్యత మరింత పెంపొందించే విధంగా కార్యక్రమం కొనసాగింది. ఈ వేడుకలు కాలనీ ప్రజల్లో ఐక్యతను, దేశభక్తి భావాన్ని చాటిచెప్పేలా ఘనంగా జరిగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.