Sunday, 16 August 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ అన్నదాన సేవ
- తిరుపతి

భక్తిశ్రద్ధలతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ అన్నదాన సేవ

తిరుపతి, ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం సాయంత్రం తిరుపతి టీ.కె. స్ట్రీట్ సమీపంలోని కొత్త వీధి వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోడ్డిండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమానికి విద్వాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జయచంద్ర రెడ్డి అన్నదాతలుగా సహకరించారు. “సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి” అనే నినాదంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదానాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఫౌండర్ తపసి మురళి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, సభ్యులు అనిల్ కుమార్, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త వినోద్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి, ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి

శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం సాయంత్రం తిరుపతి టీ.కె. స్ట్రీట్ సమీపంలోని కొత్త వీధి వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోడ్డిండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమానికి విద్వాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జయచంద్ర రెడ్డి అన్నదాతలుగా సహకరించారు.

“సేవే లక్ష్యం – సమాజమే స్ఫూర్తి” అనే నినాదంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదానాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఫౌండర్ తపసి మురళి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, సభ్యులు అనిల్ కుమార్, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త వినోద్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.