నాగర్ కర్నూలు జిల్లా: కోడేరు మండలం, నాగులపల్లి, బేడ బుడగ జంగం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నాగులపల్లి గ్రామంలో బాల గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, గణపతిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరితా జగన్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ గోపాల చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సరితా జగన్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ గోపాలచారిలను వివేకానంద యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సిరిగిరి కృష్ణ, దూపం శ్రీనివాసులు, దూపం వెంకటస్వామి, సిరిగిరి ముత్యాలు, దుదుకూరి మంత్రాలి, దూపం సాయిలు, దుదుకూరి నరేష్, సిరిగిరి వేణు, దుదుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు, యువకుల సహకారంతో బాల గణపతి పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.





