ఖమ్మం: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఖమ్మం జిల్లా ఇంచార్జిగా రావేళ్ల సందీప్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ యువ విభాగంలో సందీప్ నాయుడుకు అప్పగించిన ఈ బాధ్యతపై బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షించడం, యువత సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని సందీప్ నాయుడు తెలిపారు.



