వార్త ముఖ్యాంశాలు
- నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసిన ఘటనను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
- కూల్చివేసిన బీజేపీ జెండా గద్దెను సందర్శించిన ఆయన, ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసిన ఘటనను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
కూల్చివేసిన బీజేపీ జెండా గద్దెను సందర్శించిన ఆయన, ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జెండా గద్దెను కూల్చివేయడం ఒక సాధారణ ఘటనగా భావించవద్దని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు.బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేక రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు వ్యక్తులు చీకటి మాటున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం వారి పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు.“దమ్ముంటే ప్రజల మధ్యకు వచ్చి రాజకీయంగా ఎదుర్కోండి.. మా కార్యకర్తల జోలికి వచ్చి, మా పార్టీ జెండాలను అవమానిస్తే మాత్రం బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెబుతాం” అని హెచ్చరించారు.గతంలో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఫ్లెక్సీని చింపివేసిన ఘటన చోటుచేసుకుందని, ఇప్పుడు మరోసారి బీజేపీ జెండా గద్దెను కూల్చివేయడం చూస్తుంటే ఒకే వర్గం నుంచి పదేపదే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దోషులను గుర్తించి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ జెండాను కూల్చివేయగలరేమో కానీ బీజేపీ కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కూల్చలేరు.ఒక్క గద్దె కూల్చితే వంద గద్దెలు నిర్మిస్తాం ఒక్క జెండాను దింపితే వంద జెండాలు ఎగురవేస్తాం బీజేపీ పోరాటం ఆగదు కార్యకర్తల అడుగు వెనక్కి తగ్గదన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ , మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి గుర్రపు నరేష్ ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు వెంకటేశ్వర్ రావు ,ముచ్చింపుల గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతికుమార్ ప్రధాన కార్యదర్శి బత్తిని మల్లికార్జున్ సీనియర్ నాయకులు కక్కెర్ల సమ్మయ్య సురేష్ దొమ్మటి బచ్చయ్య ఇరుగోని లింగయ్య కొత్తపల్లి మధుకర్ శీలం ప్రవీణ్ పులి పవన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.