Friday, 2 October 2026
  • Home  
  • బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు
- పెద్దపల్లి

బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు

మంథని, అక్టోబర్ 02: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారతదేశ రెండో ప్రధానమంత్రి, “జై జవాన్ జై కిసాన్” నినాదకర్త, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు లాల్ బహదూర్ శాస్ర్తి చిత్రపటానికి, అలాగే స్థానిక గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి, సైనికుల్లో, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. ప్రతి భారతీయుడు సింహంలా ధైర్యసాహసాలతో ముందడుగు వేయాలని, దేశ దురాక్రమణకు పాల్పడే శత్రువులకు సింహస్వప్నంగా నిలవాలని పిలుపునిచ్చారు. మంథని ప్రజలంతా లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.అనంతరం, అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా ప్రజలను నడిపించిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, నాయకుడు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

మంథని, అక్టోబర్ 02:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారతదేశ రెండో ప్రధానమంత్రి, “జై జవాన్ జై కిసాన్” నినాదకర్త, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు లాల్ బహదూర్ శాస్ర్తి చిత్రపటానికి, అలాగే స్థానిక గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి, సైనికుల్లో, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. ప్రతి భారతీయుడు సింహంలా ధైర్యసాహసాలతో ముందడుగు వేయాలని, దేశ దురాక్రమణకు పాల్పడే శత్రువులకు సింహస్వప్నంగా నిలవాలని పిలుపునిచ్చారు. మంథని ప్రజలంతా లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.అనంతరం, అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా ప్రజలను నడిపించిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, నాయకుడు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.