కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రం పోలీస్‌స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఎస్‌ఐ శివప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




