Saturday, 3 October 2026
  • Home  
  • బాలికల ఉన్నత పాఠశాలకు 15 సీలింగ్ ఫ్యాన్లను వితరణ.*
- తిరుపతి

బాలికల ఉన్నత పాఠశాలకు 15 సీలింగ్ ఫ్యాన్లను వితరణ.*

*ప్రచురణ: 02 Oct 2026, 08:27 AM* నాయుడుపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల సౌకర్యార్థం 786 సేవా సంఘం ఆధ్వర్యంలో 15 సీలింగ్ ఫ్యాన్లను వితరణగా అందజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, సేవా సంఘం సభ్యులైన అరగొండ జయరామ్ – రేవతి దంపతులు తమ సొంత నిధులతో ఈ ఫ్యాన్లను సమకూర్చారు. 786 సేవా సంఘం వ్యవస్థాపకులు షేక్ రఫీ అధ్యక్షతన, ఎంఈఓ బానాల మునిరత్నం సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దాతలు ఫ్యాన్లను అందించడం అభినందనీయమని షేక్ రఫీ తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రోత్సాహంతో పాఠశాలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, పేద విద్యార్థులకు నిరంతరం చేయూతనందిస్తున్న దాతల సేవలను ఎంఈఓ బానాల మునిరత్నం కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఎంఈఓ పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరుతూ, ఫ్యాన్లు వితరణ చేసిన అరగొండ జయరామ్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని వరకుమారి దాతల నుంచి ఫ్యాన్లను స్వీకరించి, పాఠశాల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

*ప్రచురణ: 02 Oct 2026, 08:27 AM*

నాయుడుపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల సౌకర్యార్థం 786 సేవా సంఘం ఆధ్వర్యంలో 15 సీలింగ్ ఫ్యాన్లను వితరణగా అందజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, సేవా సంఘం సభ్యులైన అరగొండ జయరామ్ – రేవతి దంపతులు తమ సొంత నిధులతో ఈ ఫ్యాన్లను సమకూర్చారు. 786 సేవా సంఘం వ్యవస్థాపకులు షేక్ రఫీ అధ్యక్షతన, ఎంఈఓ బానాల మునిరత్నం సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దాతలు ఫ్యాన్లను అందించడం అభినందనీయమని షేక్ రఫీ తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రోత్సాహంతో పాఠశాలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, పేద విద్యార్థులకు నిరంతరం చేయూతనందిస్తున్న దాతల సేవలను ఎంఈఓ బానాల మునిరత్నం కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఎంఈఓ పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరుతూ, ఫ్యాన్లు వితరణ చేసిన అరగొండ జయరామ్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని వరకుమారి దాతల నుంచి ఫ్యాన్లను స్వీకరించి, పాఠశాల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.