Tuesday, 2 June 2026
  • Home  
  • బాధితులకు కొండంత అండగా ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’!
- అన్నమయ్య

బాధితులకు కొండంత అండగా ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’!

-చిట్వేల్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ -ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో సాయం – ‘ఇంటి పెద్ద కొడుకుగా ఆదుకుంటా’ అన్న మాట నిలబెట్టుకున్న సీఎం “ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం నిర్మితమవుతుంది” అనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. నిరుపేదలు, బాధితులకు కష్టం వచ్చినప్పుడు ‘మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను అండగా ఉంటాను’ అని ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయపు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. -ఖాదీ బోర్డు చైర్మన్ చొరవతో త్వరితగతిన నిధులు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ కేకే చౌదరి ప్రత్యేక చొరవ, సిఫారసుతో ఈ నిధులు అత్యంత త్వరితగతిన మంజూరయ్యాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు బాధితులకు ఈ ఆరోగ్య రక్షణ చెక్కులను పార్టీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా హస్తగతం చేశారు. -లబ్ధిదారుల వివరాలు ఇవే: 1. మద్దిన ప్రమీలమ్మ (చిట్వేల్) 2. కస్తూరి మునీశ్వర (కస్తూరివారిపల్లి) 3. బుంగటావుల రాధమ్మ (రెడ్డివారిపల్లి) 4. గోసల ఇందిరమ్మ (రెడ్డివారిపల్లి) 5. తుంగా శ్రీదేవి (తుమ్మచెట్లపల్లి) ఆపత్కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం తమకు ఊరట కలిగించేలా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, అందుకు సహకరించిన ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. -కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు: ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇన్‌చార్జ్ చక్రవర్తుల వెంకటేష్ రాజు, టౌన్ పార్టీ అధ్యక్షులు పగడాల వెంకటేష్, యూనిట్ ఇన్‌చార్జ్ బండారు శివ, బూత్ ఇన్‌చార్జ్ మద్దిన కోటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు తుంగా చిన్న సుబ్బారాయుడుతో పాటు ఎన్డీఏ కూటమి అనుబంధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. —

-చిట్వేల్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

-ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో సాయం

– ‘ఇంటి పెద్ద కొడుకుగా ఆదుకుంటా’ అన్న మాట నిలబెట్టుకున్న సీఎం
“ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం నిర్మితమవుతుంది” అనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. నిరుపేదలు, బాధితులకు కష్టం వచ్చినప్పుడు ‘మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను అండగా ఉంటాను’ అని ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయపు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

-ఖాదీ బోర్డు చైర్మన్ చొరవతో త్వరితగతిన నిధులు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ కేకే చౌదరి ప్రత్యేక చొరవ, సిఫారసుతో ఈ నిధులు అత్యంత త్వరితగతిన మంజూరయ్యాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు బాధితులకు ఈ ఆరోగ్య రక్షణ చెక్కులను పార్టీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా హస్తగతం చేశారు.

-లబ్ధిదారుల వివరాలు ఇవే:

1. మద్దిన ప్రమీలమ్మ (చిట్వేల్)
2. కస్తూరి మునీశ్వర (కస్తూరివారిపల్లి)
3. బుంగటావుల రాధమ్మ (రెడ్డివారిపల్లి)
4. గోసల ఇందిరమ్మ (రెడ్డివారిపల్లి)
5. తుంగా శ్రీదేవి (తుమ్మచెట్లపల్లి)

ఆపత్కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం తమకు ఊరట కలిగించేలా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, అందుకు సహకరించిన ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

-కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు:

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇన్‌చార్జ్ చక్రవర్తుల వెంకటేష్ రాజు, టౌన్ పార్టీ అధ్యక్షులు పగడాల వెంకటేష్, యూనిట్ ఇన్‌చార్జ్ బండారు శివ, బూత్ ఇన్‌చార్జ్ మద్దిన కోటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు తుంగా చిన్న సుబ్బారాయుడుతో పాటు ఎన్డీఏ కూటమి అనుబంధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.