Sunday, 3 May 2026
  • Home  
  • బహదూర్ పేట అగ్నిగుండ మహోత్సవంలో బియ్యపు ఆకర్ష్ రెడ్డి ప్రత్యేక పూజలు
- తిరుపతి

బహదూర్ పేట అగ్నిగుండ మహోత్సవంలో బియ్యపు ఆకర్ష్ రెడ్డి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కావమ్మ మారయ్య ఆనంద అగ్నిగుండ మహోత్సవంలో యువనేత బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లను దర్శించుకుని, భక్తులతో కలిసి అగ్నిగుండ వేడుకలను వీక్షించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆకర్ష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను చాటుతాయని, ఆ దైవకృపతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ఇంచార్జ్ కొట్టే శరవణతో పాటు పాలమంగళం శివ, గుణ, మున్నా రాయల్, వల్లం గోపి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.