Wednesday, 29 July 2026
  • Home  
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేవైఎం ఖమ్మం జిల్లా డిమాండ్
- ఖమ్మం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేవైఎం ఖమ్మం జిల్లా డిమాండ్

ఖమ్మం, జూలై (పున్నమి న్యూస్) బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శాసనాల సాయిరాం ఆధ్వర్యంలో డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం ఖమ్మం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులందరూ తమ హక్కుల సాధన కోసం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతుగా +91 82395 23455 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో వాళ్లాల రమేష్, కొమ్మ మధు, బోయినపల్లి చంద్రశేఖర్, డీకొండ శ్యామ్, నల్లమాస శ్రీనివాస్ తదితర బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)

బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శాసనాల సాయిరాం ఆధ్వర్యంలో డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సమావేశంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం ఖమ్మం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులందరూ తమ హక్కుల సాధన కోసం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతుగా +91 82395 23455 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని విద్యార్థులను కోరారు.

ఈ కార్యక్రమంలో వాళ్లాల రమేష్, కొమ్మ మధు, బోయినపల్లి చంద్రశేఖర్, డీకొండ శ్యామ్, నల్లమాస శ్రీనివాస్ తదితర బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.