Wednesday, 9 September 2026
  • Home  
  • ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: కొండ పల్లి శ్రీధర్ రెడ్డి
- ఖమ్మం

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: కొండ పల్లి శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్ /ఖమ్మం: తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నరఫరాజు రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు శిబిరాన్ని సందర్శించి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువత ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్ /ఖమ్మం:

తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నరఫరాజు రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు శిబిరాన్ని సందర్శించి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువత ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.