వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు, నవంబర్: నగరంలోని ఫిష్ మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
- నందన్ అధికారులను ఆదేశించారు.
- బుధవారం శెట్టిగుంట రోడ్డులోని చేపల మార్కెట్‌ను ఆయన సందర్శించి పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నెల్లూరు, నవంబర్: నగరంలోని ఫిష్ మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ అధికారులను ఆదేశించారు. బుధవారం శెట్టిగుంట రోడ్డులోని చేపల మార్కెట్‌ను ఆయన సందర్శించి పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్కెట్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. దుకాణదారులు, మార్కెట్ నిర్వాహకులు కూడా పరిశుభ్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.అనంతరం ఇటీవల ఇల్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు వారి నివాసాన్ని సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థానికంగా చేపట్టాల్సిన సివిల్ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే జాతీయ రహదారికి సమీపంలోని ప్రశాంతినగర్ ప్రధాన డ్రైనేజీ కాలువను పరిశీలించి మురుగునీటి పారుదల సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఇంజనీరింగ్ విభాగం ఈఈ అనిల్ కుమార్, డీఈ శ్రీనివాసులురెడ్డి, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ రఘునాథరావు, సంబంధిత సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.