Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పురమిత్ర యాప్‌తో పౌర సమస్యలకు పరిష్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పురమిత్ర యాప్‌తో పౌర సమస్యలకు పరిష్కారం

వార్త ముఖ్యాంశాలు

  • మున్సిపల్ సేవలు, పన్నుల చెల్లింపులకు యాప్‌ను వినియోగించుకోండి: కమిషనర్ నందన్ నెల్లూరు: నగర ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, పన్నులు, ఇతర ఛార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు పురమిత్ర యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
  • నందన్ సూచించారు.
  • ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మున్సిపల్ సేవలు, పన్నుల చెల్లింపులకు యాప్‌ను వినియోగించుకోండి: కమిషనర్ నందన్

నెల్లూరు: నగర ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, పన్నులు, ఇతర ఛార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు పురమిత్ర యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పురమిత్ర యాప్ ద్వారా నగరంలోని పారిశుధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అలాగే పార్కుల నిర్వహణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, ఆస్తి పన్ను, సంక్షేమ పథకాలు తదితర అంశాలపైనా తమ సమస్యలను యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్ చెల్లింపులు

పురమిత్ర యాప్ ద్వారా ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చని కమిషనర్ వివరించారు. దీనివల్ల కార్యాలయాలకు వెళ్లే సమయం, శ్రమ ఆదా అవుతాయని పేర్కొన్నారు.

ఫిర్యాదులకు ఫొటోలు జతచేసే అవకాశం

ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యల వివరాలతో పాటు సంబంధిత ఫొటోలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు.

నగరంలో పౌర సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకమైన పాలనకు సహకరించే పురమిత్ర యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కమిషనర్ నందన్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *