Wednesday, 27 May 2026
  • Home  
  • ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తి దిశగా అవగాహన సమావేశం
- తిరుపతి

ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తి దిశగా అవగాహన సమావేశం

శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో పురపాలక సంఘ కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, స్థానిక వ్యాపారులు, షాప్ యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డ్ సానిటరీ సెక్రటరీలు, పర్యావరణ పరిరక్షణ బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు నేలలో కరగకపోవడం వల్ల భూమి సారవంతత దెబ్బతింటోందని తెలిపారు. వర్షాకాలంలో డ్రైనేజీలు మూసుకుపోవడం, పశువులు ప్లాస్టిక్ తిని మృతి చెందడం, ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల విషవాయువులు వెలువడి గాలి కాలుష్యం పెరగడం వంటి అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని వివరించారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహితమైన జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు, పేపర్ బ్యాగులు వినియోగించాలని వ్యాపారులకు సూచించారు. వ్యాపారులు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వినియోగదారులకు జూట్ బ్యాగులు అందించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు షాపింగ్‌కు వెళ్లేటప్పుడు స్వచ్ఛందంగా గుడ్డ లేదా జూట్ సంచులు తీసుకెళ్లే అలవాటు పెంపొందించుకోవాలని, శ్రీకాళహస్తిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.