ఎలమంచిలి మండలం ఏటికొప్పాక ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు రాజన్న సూర్య చంద్ర శేషగిరి రావు (శేషు) విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫాం, షూస్, సాక్స్, బెల్ట్ తదితర విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జగన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబుజి, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, మాజీ వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, సర్పంచ్ కుమారుడు శ్రీను, కొత్వల సతీష్, నాగిరెడ్డి బాబ్జి ఎంపీటీసీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా భరోసా.. ఏటికొప్పాకలో స్టూడెంట్ కిట్ల పంపిణీ
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు రాజన్న సూర్య చంద్ర శేషగిరి రావు (శేషు) విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫాం, షూస్, సాక్స్, బెల్ట్ తదితర విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జగన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబుజి, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, మాజీ వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, సర్పంచ్ కుమారుడు శ్రీను, కొత్వల సతీష్, నాగిరెడ్డి బాబ్జి ఎంపీటీసీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

